ఉల్లి ధరలు ఆకాశాన్నంటి కొన్ని నెలలుగా ప్రజలను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో తాజాగా ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజా పంట మార్కెట్లోకి...
టర్కీ వంటి దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవడం వల్ల ధరలు తగ్గాయి. వీటికి తోడు తాజా పంట మార్కెట్లోకి చేరుతోంది. ఫలితంగా నెల రోజుల ముందు రూ.160గా ఉన్న కేజీ ఉల్లి ధర.. ఇప్పుడు రూ. 60-70కి చేరింది. అయితే నాణ్యత ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఉల్లి ధరలు తగ్గుతున్నాయి.
"తాజా పంట అందుబాటులోకి రావడం వల్ల ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాల్సిన అవసరం ఉంది"