తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాల నియంత్రణకు కేంద్రీకృత వ్యవస్థ?

అంతర్జాలాన్ని పర్యవేక్షించే కీలక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

అంతర్జాల నియంత్రణకు కేంద్రీకృత వ్యవస్థ?

By

Published : Jul 4, 2019, 8:22 PM IST

Updated : Jul 4, 2019, 9:50 PM IST

అంతర్జాల ట్రాఫిక్​ను పర్యవేక్షించేందుకు కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థను తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా అంతర్జాలాన్ని పర్యవేక్షించనున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్​ రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

"చరవాణులు, ల్యాండ్​లైన్లు, అంతర్జాలాన్ని న్యాయబద్ధంగా నియంత్రించేందుకు ఒక కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నాం. అంతర్జాలాన్ని ప్రస్తుతం.. అంతర్జాల సేవలందించే సంస్థలు నియంత్రిస్తున్నాయి. 'ఇంటర్నెట్​ మానిటరింగ్ సిస్టమ్​' ద్వారా ఈ పర్యవేక్షణ జరుగుతుంది. ప్రస్తుతమున్న ఈ వ్యవస్థను 'కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థ'కు అనుసంధానం చేసే అంశం కూడా పరిశీలనలో ఉంది."

--- కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్

Last Updated : Jul 4, 2019, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details