విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వ్యవస్థ (ఎఫ్డీఐ)లో కేంద్రం సవరణలు చేయనున్నట్లు సమాచారం. దేశంలోనే రెండో అతిపెద్ద అయిల్ కంపెనీ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)లో అత్యధిక షేర్ల కొనుగోలుకు విదేశీ పెట్టుబడిదారులకు వీలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం సంబంధిత శాఖలతో కేంద్రం చర్చలు జరుపుతోంది.
కేంద్రం విక్రయించనున్న 52.98 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రముఖ మైనింగ్ కంపెనీ వేదాంత సహా అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.