తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం' - బ్యాంకుల విలీన ప్రక్రియ కొనసాగుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం

భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ కొనసాగుతుందని, ఇందులో ఎలాంటి అనిశ్చితి లేదని స్పష్టం చేశారు.

Govt closely monitoring coronavirus impact on economy: FM
ఆర్థికవ్యవస్థపై కరోనా ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: నిర్మలా సీతారామన్

By

Published : Feb 26, 2020, 8:48 PM IST

Updated : Mar 2, 2020, 4:29 PM IST

భారత ఆర్థికవ్యవస్థపై కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ చెప్పారు.

కరోనా వైరస్​ (కొవిడ్​ -19) చైనాలో పుట్టి ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ మహమ్మారి వల్ల చైనాలో ఇప్పటి వరకు 2,715 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80,000 మంది కరోనా వైరస్​తో బాధపడుతున్నారు. అంతే కాకుండా కరోనా భయం ప్రపంచ వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

బ్యాంకుల విలీనం జరిగి తీరుతుంది...!

ప్రణాళికా ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం ప్రక్రియ కొనసాగుతోందని, ఇందులో ఎలాంటి అనిశ్చితికి తావులేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

నాలుగు పెద్ద రుణదాతలను సృష్టించడానికి 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయనున్నట్లు గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. యునైటెడ్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్​ ఆఫ్ కామర్స్​లు పంజాబ్​ నేషనల్​ బ్యాంకులో విలీనం కానున్నాయి. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్​ 1 నుంచి పీఎన్​బీ దేశంలోని రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించనుంది.

సిండికేట్​ బ్యాంకును కెనరా బ్యాంకుతో, అలహాబాద్​ బ్యాంకును ఇండియన్ బ్యాంకుతో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. అదే విధంగా ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్​ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కానున్నాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా

2019 ఏప్రిల్​లో బ్యాంక్​ ఆఫ్ బరోడా... విజయ బ్యాంకు, దేనా బ్యాంకులను తనలో విలీనం చేసుకుంది.

ఎస్​బీఐ

స్టేట్​బ్యాంక్ ఆఫ్ ఇండియా 2017 ఏప్రిల్​లోనే తన 5 అసోసియేట్​ బ్యాంకులైన స్టేట్​ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్​ బ్యాంక్ ఆఫ్ బికానీర్​ అండ్ జైపూర్​, స్టేట్​ బ్యాంక్ ఆఫ్ మైసూర్​, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్​, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్​లతో పాటు భారతీయ మహిళా బ్యాంకును తనలో విలీనం చేసుకుంది.

ఇదీ చూడండి:త్వరలో రూ.2వేల నోట్లు మాయం!

Last Updated : Mar 2, 2020, 4:29 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details