తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫార్మా రంగం, ల్యాప్​టాప్​ల తయారీకి ప్రోత్సాహకాలు - కేంద్ర కేబినెట్ భేటీ

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ ఐటీ హార్డ్​వేర్​ తయారీని ప్రోత్సహించేందుకు ఆ రంగానికి రూ.7,350 కోట్ల విలువ చేసే ప్రోత్సాహక పథకానికి ఆమోదం పలికింది. దీనితో పాటు ఔషధ రంగానికి రూ. 15 వేల కోట్ల రూపాయల పథకానికి పచ్చజెండా ఊపింది.

Govt clears Rs 7,350
ఫార్మా రంగం, ల్యాప్​టాప్​ల తయారీకి ప్రోత్సాహకాలు

By

Published : Feb 25, 2021, 5:30 AM IST

దేశీయంగా ఐటీ హార్డ్‌వేర్‌ తయారీని ప్రోత్సహించే దిశగా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రంగానికి రూ.7,350 కోట్ల విలువ చేసే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాల(పీఎల్‌ఐ) పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బుధవారం ప్రకటన చేశారు. ప్రపంచస్థాయిలో భారత్‌ను తయారీ కేంద్రంగా నిలిపే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. దీంతో దేశీయంగా ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు ఎగుమతులు ఊపందుకుంటాయని పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్ల పాటు ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్స్‌, ఆల్-ఇన్‌-వన్‌ పీసీలు, సర్వర్ల వంటి ఐటీ ఆధారిత హార్డ్‌వేర్‌ పరికరాల తయారీకి రూ.7,350 కోట్ల ప్రోత్సాహకాలు అందుతాయన్నారు. దీంతో రాబోయే నాలుగేళ్లలో ఈ రంగంలో రూ.3.26 లక్షల కోట్లు విలువ చేసే ఉత్పత్తి, రూ.2.45 లక్షల కోట్లు విలువ చేసే ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇటీవలే టెలికాం పరికరాల తయారీ రంగానికి ప్రభుత్వం రూ.12,195 కోట్ల పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఏప్రిల్‌లో మొబైల్, వాటి పరికరాల తయారీకీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. అది విజయవంతం కావడంతో మరిన్ని రంగాలకూ పీఎల్‌ఐ పథకాన్ని విస్తరిస్తున్నారు.

ఔషధ రంగానికి..

ఔషధ రంగం కోసం ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (పిఎల్‌ఐ) పథకానికి ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకానికి 15 వేల కోట్ల రూపాయల వ్యయం కానుంది.

ABOUT THE AUTHOR

...view details