తెలంగాణ

telangana

ETV Bharat / business

ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం - Govt bans export of all varieties of onions

ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అన్ని రకాల ఉల్లి ఎగుమతులను తక్షణమే నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో ఉల్లి ధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Govt bans export of onions with immediate effect
ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం

By

Published : Sep 15, 2020, 5:29 AM IST

దేశంలో అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. తక్షణమే ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొంటూ విదేశీ వాణిజ్య డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడిందని, దీని ఫలితంగా నెలలోనే ఉల్లిధర మూడు రెట్లు పెరిగినట్టు పేర్కొంది.

దక్షిణాసియా దేశాల వంటకాల్లో ప్రధానంగా వాడే ఉల్లిపాయల ఎగుమతిదారుల్లో భారత్‌ ప్రధానమైనది. బంగ్లాదేశ్, నేపాల్‌, మలేషియా, శ్రీలంక తదితర దేశాలు ఉల్లికోసం భారత్‌పైనే ఆధారపడతాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లిపాయల వాణిజ్య కేంద్రమైన లాసల్‌గావ్‌లో నెల వ్యవధిలోనే టన్ను ఉల్లిధరలు మూడు రెట్లు పెరగడం గమనార్హం. ప్రస్తుతం ఈ మార్కెట్‌లో టన్ను ధర రూ.30 వేలు పలుకుతోంది. దేశ రాజధాని నగరంలో ప్రస్తుతం కిలో ఉల్లిధర రూ.40గా ఉంది.

దక్షిణాది రాష్ట్రాల్లో అధిక వర్షపాతంతో వేసవిలో నాటిన ఉల్లి పంట దెబ్బతినడంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కోత ఆలస్యమైందని ముంబయికి చెందిన ఉల్లి ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు అజిత్ షా అన్నారు.

ABOUT THE AUTHOR

...view details