దేశీయ మార్కెట్లో తరచూ పెరుగుతున్న ధరల నియంత్రణకు వీలుగా ఉల్లి విత్తనాల ఎగుమతిపై తక్షణ నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా అమలులో ఉన్న నిబంధనల మేరకు ఉల్లి విత్తనాల ఎగుమతికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఇకపై పూర్తిగా ఎగుమతులను నిషేధిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్(డీజీఎసీ) నోటిఫికేషను విడుదల చేశారు. డిసెంబరు 31 దాకా దేశంలోని రిటైల్, హోల్సేల్ వ్యాపారులు పరిమిత నిల్వలు ఉంచుకునేలా కూడా ఆదేశాలు వెలువడ్డాయి.
ఉల్లి విత్తనాల ఎగుమతిపై కేంద్రం నిషేధం - ఉల్లి ధరలు
ఉల్లి విత్తనాల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. ధరలను అదుపు చేసే చర్యలో భాగంగా ఈ మేరకు ఉత్తర్వుుల జారీ చేసింది. మరోవైపు డిసెంబర్ 31 వరకు దేశంలోని రిటైల్, హోల్సేల్ వ్యాపారులు పరిమిత నిల్వలు ఉంచుకునేలా ఆదేశాలు వెలువడ్డాయి.
ఉల్లి విత్తనాల ఎగుమతిపై కేంద్రం నిషేధం
ఉల్లి వ్యాపారులకు మూడు రోజుల గడువు
ఉల్లి వ్యాపారులు మండీల నుంచి ఉల్లి కొన్నాక గ్రేడింగు, ప్యాకింగుకు మూడు రోజుల గడువు మాత్రమే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. చిరు వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ మూడు రోజుల గడువు ఆదేశాలు ఇచ్చామని వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ గురువారం ట్వీట్ చేశారు.