దేశ పౌరుల సమాచార గోప్యతపై జరిగిన ఉల్లంఘనలకు వివరణ ఇవ్వాలని వాట్సప్‌ను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. లక్షల మంది భారతీయల వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు తీసుకున్న చర్యలపై నివేదించాలని కోరింది. ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1400 మందిని లక్ష్యంగా చేసుకున్న వారిలో భారతీయ జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు ఉన్నట్లు సామాజిక మాధ్యమం వాట్సప్ వెల్లడించిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపట్టింది కేంద్రం.
భారత పౌరుల గోప్యత రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
"సామాజిక మాధ్యమం వాట్సప్‌లో దేశ పౌరుల సమాచార గోప్యత ఉల్లంఘనపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మిలియన్ల మంది భారతీయల గోప్యతను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని వాట్సాప్‌ను కోరాం."