దేశంలో రెమిడెసివర్ ఉత్పత్తిని వచ్చే వారానికల్లా వేగవంతం చేయాలని ఏడు తయారీ సంస్థలను కేంద్ర సర్కారు ఆదేశించింది. దేశంలో రెమిడెసివర్ కొరత ఉందన్న నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో, కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
రెమిడెసివర్ ఉత్పత్తి వేగవంతం చేయాలని ఆదేశాలు - రెమిడెసివర్ అప్డేట్స్
రెమిడెసివర్ కొరత ఉందన్న నివేదికలు వెల్లడైన నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే వారానికల్లా ఈ ఔషధ ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆయా సంస్థలకు సూచించింది. రెమిడెసివర్‌ను కొవిడ్ చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా తీవ్ర ఆరోగ్య సమస్యలున్న వయోజన రోగులకు దీన్ని వాడుతున్నారు.

రెమిడెసివర్
రెమిడెసివర్‌ను కొవిడ్ చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా తీవ్ర ఆరోగ్య సమస్యలున్న వయోజన రోగులకు దీన్ని వాడుతున్నారు. దేశంలో ఏడు సంస్థలు నెలకు 31 లక్షల 60 వేల సీసాల రెమిడెసివర్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.