భద్రతా కారణాల రీత్యా చైనాకు చెందిన 59 యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా ఆయా సంస్థలకు 79 ప్రశ్నలతో రూపొందించిన నోటీసును పంపించింది. మూడు వారాల్లోగా ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సూచించింది. జులై 22లోపు వీటికి బదులు ఇవ్వకుంటే పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తామని నోటీసుల్లో పేర్కొంది.
టిక్‌టాక్ సహా ఆ 59 యాప్‌లకు కేంద్రం 79 ప్రశ్నలు! - భారత్‌లో నిషేధించిన 59 యాప్స్
ఇటీవల కేంద్ర ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించింది. అయితే తాజాగా ఆయా సంస్థలకు 79 ప్రశ్నలతో కూడిన నోటీసులను పంపింది. ఈ ప్రశ్నలకు మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని.. లేకపోతే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇందులో ఆయా కంపెనీల కార్పొరేట్ మూలాలు, మాతృ సంస్థ, ఫండింగ్, డేటా మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఒకసారి ఆయా యాప్స్ సమాధానం ఇచ్చాక ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీ వాటిని పరిశీలిస్తుంది. అయితే, అంతకుముందే ఈ యాప్స్ గురించిన సమాచారాన్ని భారత్ సహా ఇతర దేశాలకు చెందిన నిఘా వర్గాలు కేంద్రానికి అందించాయి. వచ్చిన సమాధానాలను నిఘా వర్గాల వివరాలతో సరిపోలుస్తారు. ఒకవేళ ఆ సమాచారంలో తేడాలుంటే సదరు యాప్స్‌పై చర్యలుంటాయి. ఒకవేళ సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే సమీప భవిష్యత్‌లో టిక్‌టాక్ సహా మిగిలిన యాప్స్ తమ సేవలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు నోటీసుల ద్వారా తెలుస్తోంది.
ఇదీ చూడండి:విరిగిపడిన కొండచరియలు- 22 మంది బలి