తెలంగాణ

telangana

ETV Bharat / business

'అంతరాయం లేకుండా ఆసుపత్రులకు ఆక్సిజన్​ సరఫరా'

దేశంలో కరోనా వ్యాప్తితో 21రోజలు లాక్​డౌన్​ అమలవుతుంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఆక్సిజన్​ సరఫరా చేసేలా వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ఓ విభాగం చర్యలు చేపట్టింది. కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా ఆక్సిజన్​ నిల్వలు, సరఫరాకు ఆటంకాలు లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకూ సూచించింది కేంద్ర ప్రభుత్వం.

Govt announces steps to ensure uninterrupted supply of oxygen to hospitals
'అంతరాయం లేకుండా ఆసుపత్రులకు ఆక్సిజన్​ సరఫరా'

By

Published : Mar 27, 2020, 3:17 PM IST

ఆసుపత్రులకు నిరంతరాయంగా ఆక్సిజన్​ సరఫరా అయ్యేలా వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్రోలియం, పేలుడు పదార్థాల రక్షిత సంస్థ​(పెసో) చర్యలు చేపట్టింది. దేశంలో కొవిడ్​-19 విస్తరణ నేపథ్యంలో.. ఆసుపత్రులకు, పెట్రోలియం, పేలుడు పదార్థాల తయారీ సంస్థలకు, అగ్నిమాపక, గ్యాస్​ పరిశ్రమలకు అంతరాయం లేకుండా ఆక్సిజన్​ను​ సరఫరా చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రాణవాయువును అత్యవసరంగా నిల్వ, రవాణా చేయడానికి లైసెన్స్​లు మంజూరు చేసేలా పెసో ప్రధాన కార్యాలయం.. అన్ని కార్యాలయాలకు సూచనలు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

రాష్ట్రాలకూ సూచన..

ఆక్సిజన్​, నైట్రస్​ ఆక్సైడ్​ వాయువుల రవాణా, తయారీకి ఎలాంటి అంతరాయం కలిగించకుండా అనుమతి ఇవ్వాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మార్చి 25న సూచించింది పెసో. లైసెన్సుల గడువు తేదిని 2020 మార్చి 31 నుంచి 2020 సెప్టెంబరు 30 వరకు పెంచింది.

లైసెన్సుల రెన్యువల్​ ఆలస్యమైనా రుసుము కూడా వసూలు చేయడం లేదని తెలిపారు అధికారులు. ఆక్సిజన్​, సీఎన్​జీ, ఎల్​పీజీ, ఇతర వాయువుల నిల్వ కోసం వినియోగించే సిలిండర్లకు చట్టబద్ధమైన హైడ్రో పరీక్ష గడువు ​మార్చి 31తో ముగిస్తున్నప్పటికి వాటిని జూన్​ 30న పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:మొబైల్ వారంటీ ముగుస్తుందా? అయినా ఫర్వాలేదు!

ABOUT THE AUTHOR

...view details