కెయిర్న్ సంస్థతో రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ వివాదాన్ని పరిష్కరించుకుంది కేంద్రం(cairn retrospective tax dispute). కంపెనీ ఇచ్చిన ఆఫర్‌కు ఓకే చెప్పింది. రాజీ ఒప్పందం ప్రకారం ముందుగా భారత ప్రభుత్వంపై అంతర్జాతీయ కోర్టుల్లో పెట్టిన అన్ని కేసులను కెయిర్న్ ఉపసంహరించుకోవాలి(retrospective taxation india). ఆ తర్వాత రూ.7,900 కోట్ల ట్యాక్స్ రీఫండ్ ప్రక్రియను కేంద్రం ప్రారంభిస్తుంది. ఇందుకు కావాల్సిన ఫాం-2ను జారీ చేసింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి.
కెయిర్న్ కేసులు ఉపసంహరించుకోవడానికి 3-4 వారాలు పడుతుందని, ఆ తర్వాత ట్యాక్స్ రీఫండ్ ప్రక్రియను కేంద్రం ప్రారంభిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి(cairn retrospective tax case ). అయితే కెయిర్న్ అధికార ప్రతినిధి మాత్రం దీనిపై స్పందించలేదు.
కేసు నేపథ్యమిది!
విదేశీ కంపెనీలు భారత్‌లోని తమ ఆస్తులను పరోక్ష పద్ధతిలో బదిలీ చేసుకున్నప్పటికీ.. పన్ను చెల్లించేలా ఆదాయ పన్ను చట్టానికి మార్పులు చేస్తూ 2012లో యూపీఏ సర్కారు బిల్లును తీసుకొచ్చింది(cairn retro tax ). ఆ ఏడాది మే 28 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అయితే, ఆ తేదీకి ముందు జరిగిన లావాదేవీలకు(రెట్రోస్పెక్టివ్) కూడా పన్ను వసూలు చేసేలా బిల్లును రూపొందించారు. దీని ప్రకారం.. కెయిర్న్ ఎనర్జీ సహా వొడాఫోన్ సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ.. ఆయా సంస్థలు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించాయి(retrospective taxation india ).
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టులో(cairn energy arbitration case) ఈ సంస్థలు దాఖలు చేసిన రెండు వేర్వేరు వ్యాజ్యాల్లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. వొడాఫోన్ విషయంలో పెద్దగా ప్రభావం లేకపోయినా.. కెయిర్న్ ఎనర్జీ కేసులో మాత్రం 1.2 బిలియన్ డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సొమ్ము చెల్లించకపోవడం వల్ల.. ఫ్రాన్స్‌లోని భారత ఆస్తుల జప్తునకూ ఆదేశాలు వెలువడ్డాయి.
2012 నాటి చట్టం(cairn energy india retrospective tax) ఇలా ప్రభుత్వానికే చిక్కులు తెచ్చిన నేపథ్యంలో ఇటీవల నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ విధానానికి మంగళం పాడుతూ చట్టం చేసింది.
ఇదీ చదవండి:'ఆ విమానాలు పూర్తిస్థాయిలో నడవడం ఇప్పట్లో కష్టమే!'