పామాయిల్‌పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ముడి పామాయిల్‌పై పది శాతానికి, శుద్ధి చేసిన పామాయిల్‌పై 37.5 శాతానికి దీన్ని తగ్గించింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ మేరకు మంగళవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.
పామాయిల్‌పై కస్టమ్స్ సుంకం తగ్గింపు - పామాయిల్ దిగుమతి సుంకం
ముడి పామాయిల్‌పై పది శాతానికి, శుద్ధి చేసిన పామాయిల్‌పై 37.5 శాతానికి కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బుధవారం నుంచి ప్రారంభమై సెప్టెంబరు 30 వరకు సడలింపు అమల్లో ఉంటుందని పేర్కొంది.
పామాయిల్‌పై కస్టమ్స్ సుంకం తగ్గింపు
దేశంలో ఈ వంట నూనె ధరలు తగ్గడానికి ఇది దోహదపడుతుందని తెలిపింది. సెస్, ఇతర రుసుములతో కలిపి ముడి పామాయిల్‌పై ఇక నుంచి 30.25 శాతం శుద్ధి చేసిన పామాయిల్‌పై 41.25 శాతంగా ఈ సుంకం ఉంటుందని పేర్కొంది.
ఇదీ చదవండి :70 కోట్ల లింక్డ్ఇన్ యూజర్ల డేటా లీక్!