చైనాతో సరిహద్దు ఉద్రిక్తల మధ్య భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టిక్‌టాక్, షేర్ ఇట్ సహా 59 చైనా యాప్స్‌ను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ యాప్‌లను దేశ ప్రజలు వాడొద్దని సూచించింది. వీటి ద్వారా భారత్ నుంచి రకరకాల సమాచారం సేకరిస్తున్నాయంటూ చైనాకు భారత్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఆ దేశం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
"ఈ యాప్స్ ద్వారా భారత సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగే అవకాశముందని విశ్వసనీయ సమాచారం అందింది. అందువల్ల కోట్లాది మంది భారతీయుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వీటిని నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది."
-- ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రకటన.