తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇకపై ఆన్​లైన్​లోనూ బీమా అంబుడ్స్​మన్​కు ఫిర్యాదు - అంబుడ్స్​మన్​ ఎక్కడుంటారు

బీమా అంబుడ్స్​మన్​ పక్రియను మరింత పటిష్ఠం చేసేందుకు నిబంధనలు సవరించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అంబుడ్స్​మన్​ నిబంధనలు 2017లో సవరణలను మార్చి 2న నోటిఫై చేసింది. సవరించిన నిబంధనలతో పాలసీదారులు తమ ఫిర్యాదులను ఆన్​లైన్​లోనూ దాఖలు చేసేందుకు వీలు కలగనుంది.

Insurance Ombudsman Rules amendments
బీమా అంబుడ్స్​మన్​ నిబంధనల్లో సవరణలు

By

Published : Mar 3, 2021, 3:03 PM IST

బీమా పాల‌సీదారు ఫిర్యాదుల పరిష్కారం కోసం పని చేసే అంబుడ్స్​మ‌న్‌ నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. బీమా బ్రోకర్లను వీరి పరిధిలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. పాలసీదారులు ఇకపై ఆన్​లైన్​లో ఫిర్యాదులు ఫైల్​ చేసేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.

సవరించిన నిబంధనలతో అంబుడ్స్​మన్​కు ఫిర్యాదులను పరిష్కరించే పరిధి పెరగనుంది. ఇంతకు ముందు బీమా సంస్థలు, ఏజెంట్లు, బ్రోకర్లు సహా ఇత మధ్యవర్తుల సేవల్ల లోపాలకు సంబంధించిన వివాదాలకు మాత్రమే పరిష్కారం లభించేది.

బీమా అంబుడ్స్​మన్​ పక్రియను మరింత మెరుగుపరిచేందుకు నిబంధనలు సవరించినట్లు ఆర్థిక శాఖ వివరించింది. అంబుడ్స్​మన్​ నిబంధనలు 2017లో సవరణలను మార్చి 2న నోటిఫై చేసింది.

ఎవరీ అంబుడ్స్​మన్​?

పాల‌సీదారుల ఫిర్యాదులపై వేగ‌వంతమైన ప‌రిష్కారాల‌కు వీరు కృషి చేస్తారు. అంబుడ్స్​మ‌న్‌ను బీమా రంగం, సివిల్ సర్వీసెస్ లేదా న్యాయ రంగం నుంచి ఎంపిక చేస్తారు. ఈ చ‌ట్టం ప్ర‌కారం అంబుడ్స్‌మ‌న్ మూడేళ్ల పాటు కొన‌సాగుతారు లేదా వారి వ‌య‌సు 65 సంవ‌త్సరాలు వ‌చ్చే వ‌ర‌కు ఏది మొద‌ట వ‌స్తే దానిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మ‌న్‌ను ప‌బ్లిక్ గ్రీఎవ‌న్సెస్ రూల్స్, 1998 ప్ర‌కారం వీరిని నియ‌మిస్తారు. దేశ‌వ్యాప్తంగా 17 అంబుడ్స్‌మ‌న్ కార్యాల‌యాలు ఉన్నాయి. ఫిర్యాదు ఏ ప్రాంతంలో న‌మోదైంతో దాని ప్ర‌కారం అక్క‌డ అధికారిక కార్యాల‌యాల్లో ఉన్న అంబుడ్స్‌మ‌న్ ప‌రిష్కారం చూపుతారు.

ఇదీ చదవండి:పెరగనున్న టర్మ్ బీమా ప్రీమియం!

ABOUT THE AUTHOR

...view details