టెక్ దిగ్గజం గూగుల్ తన న్యూస్ షోకేస్ కార్యక్రమాన్ని భారత్‌లోను ప్రారంభించినట్లు మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగా 30 వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.
గూగుల్ న్యూస్, డిస్కవర్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేశంలోని పబ్లిషర్లను ప్రోత్సహించేందుకు, నాణ్యమైన కంటెంట్‌ను అందించేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఈ న్యూస్ షోకేస్. ఇందుకోసం ఆయా సంస్థలకు చెల్లింపులు కూడా జరపనుంది గూగుల్.