స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాక ఏ చిన్న సందేహం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది గూగుల్. మనకు కావాల్సిన ఎలాంటి సమాచారం అయిన గూగుల్‌లో సెర్చ్ చేసి ఇట్టే తెలుసుకోవచ్చు. పాఠశాల విద్యార్ధుల నుంచి ఇంట్లో ఉండే తాత, బామ్మల వరకు గూగుల్ గురించి తెలియని వారులేరు. అంత పాపులర్ అయిన ఈ సెర్చ్ ఇంజిన్‌కు ఆపేరు ఎలా వచ్చింది.. దాన్ని స్థాపించాలనే ఆలోచనకు ఎక్కడ బీజం పడింది వంటి ఆసక్తికర విషయాలను గూగుల్ అందులో పేర్కొంది. మరి అవేంటో తెలుసుకుందామా?
స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ క్యాంపస్‌లో గ్రాడ్యుయేట్ విద్యార్ధులుగా ఉన్న సమయంలో లారీ పేజ్, సెర్గేయ్ బ్రిన్‌లకు వచ్చిన ఒక సరికొత్త ఆలోచన గూగుల్‌కు బీజం వేసింది. ఆ రోజుల్లో వరల్డ్ వైడ్ వెబ్ (WWW)లో సమాచారం కోసం ప్రజలు వెతికే విధానాన్ని మరింత మెరుగుపరచాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. దాని కోసం ఒక సంస్థను స్థాపించాలనుకున్నారు. అలా 1998 సెప్టెంబరు 27 తేదీన లారీ, బ్రిన్ ఇద్దరు కలిసి గూగుల్‌ను ప్రారంభించారు. మరి పేరు ఎలా వచ్చిందంటే..