తెలంగాణ

telangana

ETV Bharat / business

2 లక్షల 50 వేల టీకాలకు నిధులిస్తాం: గూగుల్​ - పేద దేశాలకు గూగుల్ టీకా సాయం

పేద, మధ్యాదాయ దేశాలకు కరోనా టీకా అందించనున్నట్లు సెర్చ్​ ఇంజిన్​ దిగ్గజం 'గూగుల్​' ప్రకటించింది. ఈ మేరకు 2 లక్షల 50 వేల టీకాలకు నిధులిస్తామని ప్రకటించింది. అమెరికాలో వ్యాక్సిన్​ కేంద్రాల సమాచారం ప్రజలకు తెలిపేందుకు 25 కోట్ల డాలర్ల నిధులు సమకూర్చన్నున్నట్లు పేర్కొంది.

google
గూగుల్​

By

Published : Apr 16, 2021, 6:31 AM IST

అంతర్జాతీయ కొవిడ్​-19 టీకా కార్యక్రమానికి గూగుల్.. తన వంతు సాయం ప్రకటించింది. దిగువ, మధ్యాదాయ దేశాలకు 2 లక్షల 50 వేల టీకాలు అందిస్తామని, అందుకు అవసరమైన నిధులు తమ సంస్థ సమకూరుస్తుందని పేర్కొంది. వ్యాక్సిన్​ సరఫరాకు అవసరమైన సాంకేతిక సాయం కూడా అందిస్తామని తెలిపింది.

అమెరికాలో..

అమెరికాలో వ్యాక్సిన్ కేంద్రాల సమాచారం ప్రజలకు తెలిపేందుకు 25 కోట్ల డాలర్ల నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ఇంటర్నెట్​ సదుపాయం లేకపోయినా వ్యాక్సిన్ సమాచారం తెలుసుకునేందుకు వీలుగా, గూగుల్ క్లౌడ్​లో వర్చువల్ ఏజెంట్​ ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, చిలీ, భారత్, సింగపూర్​లోని వ్యాక్సినేషన్ కేంద్రాలను గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది.

ఇదీ చదవండి:ఐరోపాలో 10 లక్షలు దాటిన కరోనా మృతులు

ABOUT THE AUTHOR

...view details