తెలంగాణ

telangana

ETV Bharat / business

గూగుల్‌ పే.. గోప్యత మీ ఇష్టమే - గూగుల్​ పే అప్​డేట్స్​

వినియోగదారులకు తమ లావాదేవీ సమాచారంపై అదనపు నియంత్రణ ఉండేలా గూగుల్​ పే అప్​డేట్​ తీసుకురానుంది. లావాదేవీ చేస్తున్నప్పుడు సంబంధిత వివరాలు రికార్డ్​ కావడం అన్నది పూర్తిగా వినియోగదారుడి ఇష్టమని సంస్థ వెల్లడించింది.

gpay
గూగుల్‌ పే.. గోప్యత మీ ఇష్టమే

By

Published : Mar 12, 2021, 7:25 AM IST

గూగుల్‌ పే తన వినియోగదారుల గోప్యతా ప్రమాణాలను మరింత పెంచుతోంది. వచ్చే వారం ఈ యాప్‌లో తీసుకురానున్న అప్‌డేట్‌ వల్ల తమ లావాదేవీల సమాచారంపై వినియోగదారులకు అదనపు నియంత్రణకు వీలు కలుగుతుంది. నియంత్రణ ఉండాలా వద్దా అన్నది కూడా వారి ఇష్టమే. గూగుల్‌ పేలో ఏదైనా లావాదేవీ చేస్తున్నప్పుడు, సంబంధిత వివరాలను వినియోగించుకోవడం లేదా రికార్డ్‌ కావడం అన్నది పూర్తిగా వినియోగదారుడి ఇష్టానికి వదిలేస్తున్నట్లు గూగుల్‌ పే వైస్‌ ప్రెసిడెంట్‌ అంబరీశ్‌ కెంఘే పేర్కొన్నారు.

ఉదాహరణకు మొబైల్‌ ఫోన్‌ రీఛార్జి చేసినపుడు ఈ డేటాను ఆఫర్లు, రివార్డులకు ఉపయోగించుకోవచ్చా లేదా అన్న విషయాన్ని వినియోగదారే నిర్ధరించుకోవచ్చు. 'పర్సనలైజేషన్‌ వితిన్‌ గూగుల్‌ పే'ను ఆన్‌ చేయడం ద్వారా మరిన్ని ఎంపిక చేసుకోవడానికి వీలుంటుందని ఆయన వివరించారు. కాగా, కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల నెలవారీ చురుకైన వినియోగదార్లుండగా.. అందులో ఎక్కువ భాగం భారతీయులే.

ఇదీ చదవండి :ప్రైవేటీకరణను నిరసిస్తూ రెండు రోజులు బ్యాంకులు బంద్​!

ABOUT THE AUTHOR

...view details