సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ 'గూగుల్ పే'(Google pay) భారత్‌లో సరికొత్త ఫీచర్లను(Google pay new features india) తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మాట్లాడడం ద్వారా అవతలి వారికి చెల్లింపులు చేసే విధంగా.. స్పీచ్ టు టెక్స్ట్(Voice payment) ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు(Google pay news) తెలిపింది. యాప్‌లో హింగ్లీష్(హిందీ ఇంగ్లీష్ కలిసి) భాషను ఎంచుకునేందుకు "ఇండస్ట్రీ ఫస్ట్ అండ్ ఏ ఫస్ట్ ఫర్ గ్లోబల్లీ ఫీచర్"ను కూడా తీసుకురానున్నట్లు ప్రకటించింది.
"డబ్బులను చెల్లించే ప్రక్రియను సులభతరం చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా.. ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆర్థిక అవకాశాలను మేం సృష్టిస్తున్నాం. అది మా బ్యాంకులైనా, మా భాగస్వాములైనా కావచ్చు. భారత్‌లో డిజిటల్ చెల్లింపుల(Gpay india) విషయంలో మేం పోషిస్తున్న పాత్రకు సంతోషిస్తున్నాం."
-అంబరీశ్ కెంఘే, గూగుల్ పే వైస్ ప్రెసిడెంట్
"డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు 'హింగ్లీష్' భాషను ఎంచుకునేందుకు వీలుగా.. 'ఇండస్ట్రీ ఫస్ట్ అండ్ ఏ ఫస్ట్ ఫర్ గూగుల్ గ్లోబల్లీ' ఫీచర్‌ను తీసుకువస్తున్నాం. ఈ ఆప్షన్ ద్వారా వినియోగదారులు సులభంగా మా యాప్‌ను వాడగలరు" అని అంబరీశ్ పేర్కొన్నారు.