వినియోగదారులు... అనుమానాస్పద లావాదేవీలను సులభంగా గుర్తించడం కోసం గూగుల్ పే నోటిఫికేషన్లు, ఎస్ఎంఎస్ అలర్ట్ సేవలను ప్రారంభించింది. వినియోగదారులు తమ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు పంపే జరిపే ప్రతిసారీ ఇలా ఎస్ఎంఎస్లు పంపించడం ద్వారా సురక్షిత లావాదేవీలు జరగడానికి వీలవుతుంది.
"వినియోగదారులు (గూగుల్ పే) మాపై నమ్మకంతో తమ విలువైన సంపదను (డబ్బును) మాకు అప్పగించారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత మాపై ఉంది."
- అంబరీష్ కెంఘే, గూగుల్ పే ప్రొడక్ట్ మేనేజర్
ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకుకు లావాదేవీలకై ఇటీవల ఎక్కువగా 'యూపీఐ' తరహా డిజిటల్ పేమెంట్ యాప్స్కే ప్రాధాన్యం ఇస్తున్నారు వినియోగదారులు.