సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ తన వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ 'మీట్' సేవలను భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. రానున్న వారాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మీట్‌లో ప్రతిరోజు 300 కోట్ల నిమిషాలపాటు వీడియో సమావేశాలు జరుగుతున్నాయి.
గూగుల్ మీట్‌ను ఇకపై ఉచితంగా వాడొచ్చు
ఇటీవలి కాలంలో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుకుంది. రానున్న వారాల్లో తమ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ గూగుల్ మీట్ సేవలు అందరికీ ఉచితంగా అందివ్వనున్నట్లు ప్రకటించింది.
గూగుల్ మీట్ అందరికీ ఉచితం
రోజు 30 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరుతున్నారు. కరోనా వైరస్ ఉద్ధృతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ సమావేశాలు పెరిగిపోయిన నేపథ్యంలో మీట్ సేవలను ఉచితం చేయాలని గూగుల్ నిర్ణయించినట్లు సమాచారం. మీట్ సేవలు వినియోగించుకోవాలనుకునే వారికి కచ్చితంగా గూగుల్‌లో ఖాతా ఉండాలి.
ఇదీ చూడండి:ఆఫీస్‌కు రావాలంటే 'ఆరోగ్యసేతు' ఉండాల్సిందే!