ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్... ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లోని తన మ్యాప్‌ల్లో వివిధ ప్రయాణ సాధనాల ఎంపికలను (మిక్స్డ్ మోడ్ కమ్యూట్ ఆప్షన్స్) పొందుపరచాలని నిర్ణయించింది. దీని ద్వారా వాహనాల రాకపోకలను వినియోగదారులు మరింత తేలికగా తెలుసుకోగలుగుతారు. రవాణా సాధానాల్లో తమకు అనువైనదాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ప్రయాణికులకు లభిస్తుంది.
గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పటివరకు రైలు, బస్సు, సొంత వాహనం, ద్విచక్రవాహనం... ఇలా వేర్వేరు వాహనాల్లో గమ్యస్థానాన్ని చేరుకునేందుకు ఉన్న మార్గాల్ని తెలుసుకునే వీలుంది. మిక్స్డ్ మోడ్‌లో... ఎక్కడి వరకు ఏ వాహనంలో వెళ్లాలో, ఆ తర్వాత ఏ వాహనం ఎక్కాలో తెలుస్తుంది.
ప్రస్తుతం దిల్లీ, బెంగళూరులో మాత్రమే ఈ సౌకర్యం ఉంది. త్వరలోనే మిగతా నగరాలకు అందుబాటులోకి రానుంది. గూగుల్ మ్యాప్స్ ప్రారంభించి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జెన్ ఫిట్జ్‌పాట్రిక్ ఈ విషయాలను వెల్లడించారు.
"ఆండ్రాయిడ్ కోసం గూగుల్ మ్యాప్స్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ట్యాబ్ ఉంది. ఇందులో ప్రజా రవాణా, ఆటోరిక్షాల సమాచారం ఉంటుంది. వినియోగదారులు ఏ స్టేషన్లో వాహనాన్ని బుక్ చేసుకోవాలో, ఎక్కడ దిగాలో తెలుపుతుంది. అలాగే ప్రయాణానికి ఎంత సమయం పడుతుందో కూడా తెలియజేస్తుంది."- జెన్ ఫిట్జ్‌పాట్రిక్, గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్
భారత్ ప్రేరణతో