తెలంగాణ

telangana

ETV Bharat / business

సెప్టెంబర్​ 10న మార్కెట్లోకి 'గూగుల్​-జియో' స్మార్ట్​ఫోన్​

జియో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​ జియోఫోన్​ నెక్ట్స్​ను తీసుకురానున్నట్లు ప్రకటించారు రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ. గూగుల్​తో కలిసి దీనిని అభివృద్ధి చేసినట్లు రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఏజీఎంలో వెల్లడించారు. భవిష్యత్తుల్లో ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్​ఫోన్​ ఇదే అవుతుందని అన్నారు.

Google, Jio jointly developed JioPhone Next
'గూగుల్​-జియో' స్మార్ట్​ఫోన్​!

By

Published : Jun 24, 2021, 3:39 PM IST

Updated : Jun 24, 2021, 5:17 PM IST

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక ప్రకటన చేశారు ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ. గూగుల్​- జియో సంయుక్తంగా జియోఫోన్​ నెక్ట్స్​ అనే స్మార్ట్​ఫోన్​ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు.

వినాయకచవితి సందర్భంగా.. సెప్టెంబర్​ 10న మార్కెట్లోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. గూగుల్​, జియో అప్లికేషన్లన్నింటికీ వర్తించేలా, ఆండ్రాయిడ్​ ఓఎస్​తో పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. 5జీ కోసం గూగుల్​ క్లౌడ్​ను వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు.

జియోఫోన్​ నెక్ట్స్​పై అంబానీ ప్రకటన

భవిష్యత్తులో భారత్​లోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్​ఫోన్​గా ఇది నిలుస్తుందని అన్నారు అంబానీ.

జియో ఫోన్​ నెక్ట్స్​ ఫీచర్లివే..

జియోఫోన్​ నెక్ట్స్​ ఫీచర్లు
  • వాయిస్​ అసిస్టెంట్​
  • రియాలిటీ ఫిల్టర్స్​తో స్మార్ట్​ కెమెరా
  • లాంగ్వేజ్​ ట్రాన్స్​లేషన్​

ఇదీ చదవండి:'సంస్థ వృద్ధి కన్నా.. సేవా కార్యక్రమాలతోనే తృప్తి'

Last Updated : Jun 24, 2021, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details