ప్రముఖ సాంకేతిక దిగ్గజం గూగుల్.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వొడాఫోన్ ఇండియాలో వాటాలను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్ఫాబెట్ సంస్థ వొడాఫోన్ ఇండియాలో 5 శాతం వాటాను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.
వొడాఫోన్ ఇండియాలో.. బ్రిటీష్ టెలికాం సంస్థ వొడాఫోన్కు 45 శాతం వాటా ఉంది. వొడాఫోన్ ఇండియా లిమిటెడ్(వీఓఎల్).. ప్రభుత్వానికి 58 వేల కోట్ల రూపాయలు బాకీపడి తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కంపెనీని మూసివేయాల్సి వస్తుందని గతంలోనే వొడాఫోన్ ఐడియా ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా వెల్లడించారు.
ఈ తరుణంలో తమ కంపెనీ వాటాలు విక్రయించే అంశాన్ని వొడాఫోన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు సంస్థలు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.