తెలంగాణ

telangana

ETV Bharat / business

గూగుల్​ డ్యుయోలో 12 మందితో గ్రూప్​ వీడియో కాలింగ్​! - Google Chrome group calls

సెర్చ్ ఇంజిన్​ గూగుల్ మరో ఫీచర్​ను ప్రవేశపెట్టనుంది. గూగుల్​ డ్యుయోలో ఎక్కువమంది వినియోగదారులు చేరుతున్న నేపథ్యంలో గ్రూప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని కల్పించనుంది. ప్రతివారం కోటిమందికి పైగా గూగుల్​ డ్యుయోలో భాగమవుతున్నారు.

Google Duo to soon let you make group calls on Chrome
త్వరలో గూగుల్​లోనూ గ్రూప్​ వీడియో కాలింగ్​

By

Published : May 11, 2020, 12:06 AM IST

కరోనా వ్యాప్తితో కోట్లాదిమంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. భౌతిక దూరం పాటిస్తూ ఇంటివద్దే ఉంటున్న కారణంగా.. కుటుంబ సభ్యులు, మిత్రుల మధ్య వీడియో కాలింగ్​లకు గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో టెక్​ దిగ్గజం గూగుల్​.. డ్యుయోలో ఒకేసారి 12 మందితో సంభాషించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ప్రయోగాత్మకంగా క్రోమ్​ బ్రౌజర్​లో ఈ సదుపాయం కల్పించనుంది.

గూగుల్ అకౌంట్ ఉన్న వారిని ఓ లింక్ ఆధారంగా ఈ గ్రూప్ వీడియో కాల్​కు ఆహ్వానించవచ్చని పేర్కొంది. ఈ వారంలోనే ఈ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొస్తామని.. ఆండ్రాయిడ్​, ఐఓఎస్​లలో దీనిని వినియోగించవచ్చని స్పష్టం చేసింది.

వినోదాత్మకంగా..

వీడియో కాలింగ్​ సమయంలో ఎదుటివారిని ఆశ్చర్యపరిచేందుకు మాస్కులు, కళ్లద్దాలు వంటి వినోదాత్మక ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయని వివరించింది గూగుల్. ఇతరులతో మాట్లాడుతుండగానే ఫొటో కూడా తీసుకునే అవకాశం కల్పించింది. ఒకరోజు జరిపిన వీడియోకాల్​, వాయిస్ మెసేజ్​లు కూడా ఆటోమేటిక్​గా సేవ్​ అయ్యే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది.

అవాంతరాలు లేకుండా..

వీడియో కాలింగ్​ సమయంలో అనుకోకుండా మాటలు వినిపించకపోవడం, కాల్ కట్ అయిపోవడం లాంటి అవాంతరాలు లేకుండా మ్యూట్, హ్యాంగ్ అప్ అనే ఆప్షన్లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు చెప్పింది గూగుల్.

ఇదీ చదవండి:'గూగుల్' ఉద్యోగులకు ఏడాదంతా వర్క్​ఫ్రమ్​ హోమ్​!

ABOUT THE AUTHOR

...view details