Google Bonus For Employees: ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ ఉద్యోగులకు భారీ బోనస్‌ను ప్రకటించింది. తాజాగా సంస్థ తీసుకున్న రిటర్న్ టూ ఆఫీస్ ఆలోచనను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఉద్యోగులకు 1600 డాలర్లను బోనస్‌గా చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
కేవలం కంపెనీ ఉద్యోగులకు మాత్రమే కాకుండా.. ఈ బోనస్‌ను సంస్థ నియమించుకున్న ఫ్రీలాన్సర్లకు, ఇంటర్న్‌లకు కూడా ఈ ఒన్ టైం క్యాష్ బోనస్ వర్తిస్తుందని గూగుల్ పేర్కొంది. ఈ మొత్తాన్ని ఈ నెలలోనే ఉద్యోగులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఉద్యోగులుకు మద్దతుగా నిలవడానికి వర్క్‌ఫ్రమ్-హోమ్ అలవెన్స్, వెల్బీయింగ్ బోనస్‌తో పాటు తాజాగా ప్రకటించిన బోనస్‌ను జమ చేయనుంది.