తెలంగాణ

telangana

ETV Bharat / business

అక్టోబరులో దేశీయ విపణిలోకి గూగుల్‌ పిక్సెల్‌ 4ఏ - google pixel smart phone

గూగుల్ సరికొత్త హంగులతో రూపొందించిన పిక్సెల్ 4ఏ స్మార్ట్​ఫోన్​ను అక్టోబర్​లో భారత మార్కెట్​లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. 5.8 అంగుళాల తాకేతెరతో రూపొందించిన ఈ ఫోన్​లో.. 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమోరీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

Google announces Pixel 5, Pixel 4A 5G, and Pixel 4A all at once
అక్టోబరులో దేశీయ విపణిలోకి గూగుల్‌ పిక్సెల్‌ 4ఏ

By

Published : Aug 4, 2020, 6:01 AM IST

గూగుల్‌ తాజా ఆవిష్కరణ పిక్సెల్‌ 4ఏ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే అక్టోబరులో మన దేశీయ విపణిలోకి ప్రవేశ పెట్టనుంది. అయితే 5జీ సాంకేతికతతో పనిచే పిక్సెల్‌5, పిక్సెల్‌ 4ఏ (5జీ)ని మాత్రం భారత్‌, సింగపూర్‌ విపణుల్లోకి తీసుకురావడం లేదు.

అద్భుతమైన కెమేరా, ఫీచర్‌ డ్రాప్స్‌ వంటి సదుపాయాలు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటాయని గూగుల్‌ తెలిపింది. 5.8 అంగుళాల తెర, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 730జి మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌, 6జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత మెమొరీ వంటివి ఈ ఫోన్‌లో సదుపాయాలు. ధరను సంస్థ వెల్లడించలేదు.

ABOUT THE AUTHOR

...view details