తెలంగాణ

telangana

ETV Bharat / business

గూగుల్ డూడుల్​ పోటీలో గెలిస్తే రూ.5 లక్షలు

గూగుల్ భారత చిన్నారుల కోసం​ డూడుల్​ పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. విజేతకు రూ.5 లక్షల బహుమతిని అందిస్తామని తెలిపింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది.

గూగుల్ డూడుల్​ పోటీలో గెలిస్తే రూ.5 లక్షలు

By

Published : Aug 2, 2019, 11:49 AM IST

Updated : Aug 2, 2019, 12:28 PM IST

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత చిన్నారులకు డూడుల్​ పోటీలు నిర్వహిస్తున్నట్లు గూగుల్​ ప్రకటించింది. విజేతకు రూ.5 లక్షల ఉపకారవేతనం అందిస్తామని తెలిపింది. అంతేకాక ఆ విద్యార్థి చదువుతున్న పాఠశాలకు లేదా లాభాపేక్షలేని సంస్థకు రూ.2 లక్షల విలువైన సాంకేతిక ప్యాకేజీతో పాటు మరిన్ని బహుమతులూ అందించనుంది గూగుల్​.

"'నేను పెద్దయ్యాక, ఎలా ఉండాలంటే' అనే నేపథ్యంతో డూడుల్స్​ రూపొందించాలి. ఇందులో కచ్చితంగా 'G-O-O-G-L​-E' (గూగుల్​) అనే అక్షరాలు ఉండాలి. ఎంపికైన డూడుల్​ నవంబర్​ 14న గూగుల్​ సెర్చ్​ ఇంజన్​ www.google.co.in లో కనిపిస్తుంది. రూ.5 లక్షల బహుమతి అందుతుంది."

- సప్నా చందా, డైరెక్టర్​ ఆఫ్ మార్కెటింగ్, ఆసియా అండ్ ఇండియా, గూగుల్​

చందమామపై జీవితం నుంచి కాలుష్యరహిత ప్రపంచం వరకు, అలాగే మేఘాల నుంచి అంతరించిపోతున్న జంతువులతో నిండిన స్వర్గధామం వరకు దేన్నైనా చిన్నారులు చిత్రించవచ్చు. చిన్నారులు తమ ఊహలకు అనుగుణంగా సృజనాత్మకంగా స్కెచ్​లు లేదా పెయింటింగ్స్​ గీయవచ్చు.

చిన్నారి కళాకారులు... క్రేయాన్స్, వాటర్ కలర్స్, గ్రాఫిక్ డిజైన్​ ఉపయోగించి డూడుల్స్ రూపొందించవచ్చు. మట్టితోనూ డూడుల్స్​ తయారు చేయవచ్చు. వీటిని ఆగష్టు 1 నుంచి సెప్టెంబర్​ 30 సాయంత్రం 10 గంటలలోపు గూగుల్ వెబ్​సైట్​లో అప్​లోడ్ చేయాలి.

20 ఉత్తమ డూడుల్స్​ను జ్యూరీ నిర్ణయిస్తుంది. వీటిని అక్టోబర్ 21 నుంచి నవంబర్​ 6 వరకు బహిరంగ ఓటింగ్​ కోసం ఉంచుతారు. ఓటింగ్​లో ప్రథమస్థానంలో నిలిచినవారిని విజేతగా ప్రకటిస్తారు.

ఇదీ చూడండి: కొనసాగుతున్న స్టాక్ ​మార్కెట్ నష్టాల పరంపర

Last Updated : Aug 2, 2019, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details