తెలంగాణ

telangana

ETV Bharat / business

టెక్ ఉద్యోగులకు అప్పటివరకు వర్క్ ఫ్రమ్​ హోమ్​ తప్పదు! - గూగుల్ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం పొడగింపు

టెక్​ దిగ్గజం గూగుల్​ మరోసారి ఆఫీస్​ రీ ఓపెన్​ ప్లాన్​పై (Google Extended Work form Home) వెనక్కి తగ్గింది. కరోనా డెల్టా వేరియంట్ భయాలు(COVID Delta variant), వ్యాక్సినేషన్​ తప్పనిసరి నిబంధనలు ఇందుకు కారణం. మరిన్ని కంపెనీలు కూకా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Google office
గూగుల్ ఆఫీస్​

By

Published : Sep 1, 2021, 12:57 PM IST

ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రణాళికను (Google Extended Work form Home) మరోసారి వాయిదా వేసింది గూగుల్. ఆఫీసుకు తిరిగి వచ్చే ముందే ప్రతి ఒక్కరు రెండు డోసుల టీకా వేసుకుని ఉండాలనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి వరకు మెజారిటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఎత్తివేసే యోచన లేదని గూగుల్ సీఈఓ సుందర్​ పిచాయ్​ తన బ్లాగ్​ పోస్ట్​లో పేర్కొన్నారు. ఆ తర్వాతే స్థానిక పరిస్థితులను బట్టి దేశాల వారీగా వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ఇంటి నుంచి పని చేసే విధానంపై నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.

ఆఫీసుల రీ ఓపెనింగ్​ ప్రణాళికను గూగుల్ వాయిదా వేయడం వరుసగా ఇది రెండో సారి. ఇంతకు ముందు జులైలో గూగుల్​ ప్రధాన కార్యాలయాన్ని (కాలిఫోర్నియాలోని మౌంటెన్​ వ్యూలో) పూర్తిగా తెరవాలని భావించింది. అయితే ఉద్యోగులంతా పూర్తిగా వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరి అనే నిబంధన కారణంగా ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గింది.

డెల్టా భయాలు..

వ్యాక్సిన్ తప్పనిసరి నిబంధనలతో పాటు.. కరోనా డెల్టా వేరియంట్ భయాలు (COVID Delta variant) కూడా టెక్​ కంపెనీలు వర్క్ ఫ్రం హోంను పొడిగించేందుకు కారణం. డెల్టా వేరియంట్ వల్ల.. కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. చాలా సంస్థలు ఆఫీసులను రీ ఒపెన్​ చేసే విషయంలో పునరాలోచనలో పడ్డాయి. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​ ఇది వరకే వర్క్​ ఫ్రం హోంను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరిన్ని దిగ్గజ సంస్థలు కూడా అదే ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి:తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు- ఏ నగరంలో ఎంతంటే..

ABOUT THE AUTHOR

...view details