తెలంగాణ

telangana

ETV Bharat / business

హమ్మయ్యా.. బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా - సమ్మె సైరన్​

వేతనాల పెంపుకోసం చేయాలనుకున్న పోరుబాటను విరమించుకున్నారు బ్యాంకు ఉద్యోగులు. జీతాల పెంపుపై ఇండియన్ బ్యాంక్స్​ అసోసియేషన్ సానుకూల​ స్పందనతో ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు తలపెట్టిన సమ్మెను వాయిదా వేశాయి బ్యాంక్ యూనియన్లు.

Bank Unions defer strike
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా

By

Published : Mar 1, 2020, 10:28 AM IST

Updated : Mar 3, 2020, 1:09 AM IST

ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాలనుకున్న బ్యాంకు సమ్మె వాయిదా పడింది. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్​ అసోసియేషన్ (ఐబీఏ) సానుకూలంగా స్పందించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి యూనియన్లు.

ఈ మేరకు యునైటెడ్​ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్​బీయూ) అధికారిక ప్రకటన చేసింది. సుదీర్ఘ చర్చల అనంతరం 15 శాతం వేతన పెంపు, ఐదు రోజుల పని దినాలపై ఐబీఏ సానుకూలంగా స్పందించిందని యూఎఫ్​బీయూ తెలిపింది.

ఇదీ చూడండి:క్రూడ్‌ తగ్గింది... పెట్రో తగ్గదేం?

Last Updated : Mar 3, 2020, 1:09 AM IST

ABOUT THE AUTHOR

...view details