కొవిడ్ సంక్షోభం వేళ టీకాలు, ఔషధాలు, ఇతర సామగ్రిపై జీఎస్టీ(GST) తగ్గించాలని దేశవ్యాప్తంగా వినతులు వస్తున్న క్రమంలో ఈ అంశంపై సమీక్షించేందుకు మంత్రులతో బృందాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలో 8 మంది మంత్రులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
టీకాలు(VACCINES), కొవిడ్ సంబంధిత సామగ్రి, ఇతర అవసరాలపై జీఎస్టీ మినహాయింపు లేదా తగ్గించే విషయంపై ఈ బృందం అధ్యయనం చేయనుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. జూన్ 8 లోపు మంత్రుల బృందం నివేదిక సమర్పిస్తుందని, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది.