అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర దిల్లీలో రూ. 80 వృద్ధిచెంది 38 వేల 789 రూపాయలకు చేరింది. వెండి ధర రూ. 101 పెరిగింది. సోమవారం ట్రేడింగ్లో రూ. 45, 725గా ఉన్న కిలో వెండి ఇవాళ.. 45 వేల 826 రూపాయలకు చేరింది.
రూపాయి బలోపేతంతో కాస్త ఊరట...
అమెరికా పారిశ్రామికోత్పత్తి తగ్గడం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంపై ఆందోళనలు మరింత పెరగడం... పసిడి ధరలపై ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,463 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 16.91 డాలర్లకు చేరింది.
ఈ పరిస్థితుల మధ్య భారతీయ మార్కెట్లోనూ బంగారం ధర గణనీయంగానే పెరగాల్సి ఉంది. అయితే... రూపాయి బలోపేతం, దేశీయంగా పసిడికి డిమాండ్ తగ్గుదలతో 10 గ్రాముల ధరపై పెంపు రూ.80కే పరిమితమైంది.