బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.158 ఎగిసి.. రూ.50,980 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పుత్తడికి డిమాండ్ వరుసగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయంగానూ పసిడి ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు రూ.697 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,043 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,916 డాలర్లకు పెరిగింది. వెండి ధర స్వల్పంగా పెరిగి.. ఔన్సుకు 24.34 డాలర్లకు చేరింది.
ఇదీ చూడండి:నాలుగో రోజూ సూచీల జోరు- 41 వేలపైకి సెన్సెక్స్