తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేక్​ పడింది. మంగళవారం 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.660కిపైగా దిగొచ్చింది. వెండి ధర కిలోకు ఏకంగా రూ.1400లకుపైగా తగ్గి.. రూ.63వేల దిగువకు చేరింది.

By

Published : Nov 10, 2020, 5:40 PM IST

GOLD AND SILVER PRICE
నేటి బంగారం ధరలు

బంగారం మంగళవారం భారీగా దిగొచ్చింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.662 తగ్గి.. రూ.50,338 వద్దకు చేరింది.

పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు భారీగా రూ.1,431 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,217 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో మాత్రం ఔన్సు బంగారం ధర 1,886 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 24.31 డాలర్ల వద్ద దాదాపు ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:బంగారు రుణాలకు భలే డిమాండ్!

ABOUT THE AUTHOR

...view details