తెలంగాణ

telangana

ETV Bharat / business

రెండోరోజూ దిగొచ్చిన పసిడి- నేటి ధరలివే..

బంగారం, వెండి ధరలు వరుసగా రెండోరోజూ తగ్గుదలను నమోదు చేశాయి. 10 గ్రాముల పసిడిపై రూ.631 తగ్గింది. కిలో వెండి ధర రూ.1,681 క్షీణించింది.

Gold tanks Rs 631and Silver tumbles Rs 1,681
వరుసగా రెండోరోజూ దిగొచ్చిన పసిడి

By

Published : Oct 14, 2020, 5:43 PM IST

పసిడి ధర బుధవారం భారీస్థాయిలో దిగొచ్చింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 631 తగ్గి.. రూ.51,367కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో పసిడికి డిమాండ్ భారీగా తగ్గడమే.. దేశంలో ధరల క్షీణతకు కారణమని విశ్లేషకులు అంచనా వేశారు. వెండి ధర రూ. 1,681 పతనం కాగా.. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.62,158గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,896 డాలర్లకు పడిపోయింది. వెండి ధర ఔన్సుకు 24.16 డాలర్లుగా ఉంది.

ఇదీ చదవండి:చక్రవడ్డీ మాఫీలో జాప్యంపై సుప్రీం అసంతృప్తి

ABOUT THE AUTHOR

...view details