బంగారం ధర సోమవారం భారీగా రూ.460 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.48,371 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ తగ్గుతున్న కారణంగా దేశీయంగా ధరలు దిగొస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యాక్సిన్ వార్తలతో బంగారం అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.