బంగారం ధర గురువారం మళ్లీ తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.248 తగ్గి.. రూ.49,714 వద్దకు చేరింది.
వ్యాక్సిన్‌పై వెలువడుతున్న వరుస ప్రకటనలతో మదుపరులు పసిడి నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుని స్టాక్ మార్కెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధర క్రమంగా దిగొస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.