తెలంగాణ

telangana

ETV Bharat / business

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు - పది గ్రాముల బంగారం ధర

బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.48,200 దిగువకు చేరింది. వెండి దాదాపు రూ.150 దిగొచ్చింది.

gold and silver price fell again
తగ్గిన బంగారం వెండి ధరలు

By

Published : Jan 28, 2021, 4:24 PM IST

బంగారం ధర మరింత దిగొచ్చింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర గురువారం స్వల్పంగా రూ.109 తగ్గి.. రూ.48,183 వద్దకు చేరింది.

వెండి ధర కూడా కిలోకు(దిల్లీలో) రూ.146 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.65,031 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,840.7 డాలర్లకు దిగొచ్చింది. వెండి ఔన్సుకు 25.41 డాలర్ల వద్ద దాదాపు ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:2020లో బంగారానికి భారీగా తగ్గిన డిమాండ్

ABOUT THE AUTHOR

...view details