తెలంగాణ

telangana

ETV Bharat / business

మరింత తగ్గిన బంగారం ధర.. 10 గ్రాములు ఎంతంటే...

బంగారం వెడి ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర (దిల్లీలో) రూ.95 క్షీణించింది. వెండి కిలోకు రూ.128 తగ్గింది.

Gold slips by Rs 95 on stronger rupee, weak demand
బంగారం ధరలు

By

Published : Dec 10, 2019, 4:38 PM IST

బంగారం ధర వరుసగా తగ్గుతూ వస్తోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛ మైన బంగారం ధర నేడు రూ.95 తగ్గింది. ప్రస్తుత ధర రూ.38,460కి చేరింది.

దేశీయంగా డిమాండు లేమితో పసిడి ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రూపాయి బలపడుతుండటమూ పుత్తడి ధరల తగ్గుదలకు మరో కారణంగా తెలుస్తోంది.

బంగారంతో పాటే వెడి ధర నేడు క్షీణించింది. కిలో వెండి ధర నేడు (దిల్లీలో) రూ.128 తగ్గి.. రూ.44,607కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,463 డాలర్లకు వద్దకు చేరింది. వెండి ఔన్సుకు 16.62 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి:పందుల దెబ్బకు చైనా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం!

ABOUT THE AUTHOR

...view details