తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. నేడు ఎంతంటే? - పది గ్రాముల బంగారం ధర

పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగియి. దిల్లీలో నేడు 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.4 వృద్ధి చెందింది. వెండి కిలోకు రూ.7 పెరిగింది.

gold
బంగారం ధర

By

Published : Jan 20, 2020, 4:46 PM IST

Updated : Feb 17, 2020, 5:54 PM IST

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.4 పెరిగి.. రూ.40,748కి చేరింది.

రూపాయి బలహీనపడటము, అంతర్జాతీయంగా పసిడికి పెరిగిన డిమాండ్​తో.. దేశీయంగా ధరలు వృద్ధి చెందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బంగారంతో పాటే వెండి ధర నేడు పుంజుకుంది. కిలో వెండి ధర నేడు రూ.7(దిల్లీలో) పెరిగి.. రూ.47,863 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,560 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 18.05 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి:'70% పేదలకంటే ఒక శాతం ధనికుల సంపదే ఎక్కువ'

Last Updated : Feb 17, 2020, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details