తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం ధర- నేటి లెక్కలు ఇవే...

బంగారం, వెండి ధరలు బుధవారం కూడా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.51 వేల దిగువకు చేరింది. వెండి కిలోకు భారీగా రూ.1,900 తగ్గింది.

By

Published : Sep 23, 2020, 6:08 PM IST

gold price today
నేటి బంగారం ధరలు

బంగారం ధర వరుసగా తగ్గుతూ వస్తోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి బుధవారం రూ.614 దిగొచ్చి.. రూ.50,750 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో పసిడి డిమాండ్ తగ్గడం వల్ల.. దేశీయంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కూడా బుధవారం కిలోకు భారీగా రూ.1,898 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.59,720 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,874 డాలర్లకు దిగొచ్చింది. వెండి ఔన్సుకు స్వల్పంగా తగ్గి 23.26 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి:'ఈ ఏడాది భారత వృద్ది రేటు -5.9 శాతం'

ABOUT THE AUTHOR

...view details