తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎంతంటే? - పెట్రోల్​ ధర

ఏపీ, తెలంగాణలో బంగారం ధర (Gold Rate Today) స్వల్పంగా పెరిగింది. వెండి ధర మరింత తగ్గింది. రెండు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి.

Today Gold price
నేటి బంగారం ధరలు

By

Published : Aug 20, 2021, 8:56 AM IST

బంగారం ధరలు(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర దాదాపు రూ.50 వరకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర రూ.48,704‬గా ఉంది.
  • ఈ నగరాల్లో కేజీ వెండి రూ.64,315 పలుకుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,784.35 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 23.25 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు

హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.89 వద్ద స్థిరంగా ఉంది, డీజిల్ ధర లీటరుకు 20 పైసలు తగ్గి రూ.97.39 వద్దకు దిగొచ్చింది.

వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.106.86గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర 19 పైసలు తగ్గి రూ.98.89 వద్దకు చేరింది.

గుంటూరులో పెట్రోల్ ధర లీటర్​ రూ.108.08 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్​ లీటర్​పై 19 పైసలు తగ్గి రూ.99.07 వద్దకు చేరింది.

ఇదీ చదవండి:హోండా నుంచి కొత్త బైక్‌.. ధర, ప్రత్యేకతలివే..

ABOUT THE AUTHOR

...view details