తెలంగాణ

telangana

ETV Bharat / business

దిగొస్తున్న పసిడి ధర.. నేడు ఎంత తగ్గిందంటే? - పసిడి ధరలు

దేశీయంగా బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.102 క్షీణించింది. కిలో వెండి ధర రూ.45 వేల దిగువకు చేరింది.

దిగొస్తున్న పసిడి ధర.. నేడు ఎంత తగ్గిందంటే?

By

Published : Nov 22, 2019, 4:53 PM IST

పసిడి, వెండి ధరలు వరుసగా దిగొస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో నేడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.102 తగ్గింది. ప్రస్తుత ధర రూ.38,856కి చేరింది.

దేశీయంగా పసిడి కొనుగోళ్ల డిమాండు తగ్గడమే ధరల క్షీణతకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

కిలో వెండి ధర నేడు (దిల్లీలో) ఏకంగా రూ.815 తగ్గి.. రూ.44,949 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో మాత్రం ఔన్సు బంగారం ధర 1,467 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 17.15 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి:'ఉపసంహరణ' ద్వారా 'ప్రైవేటీకరణ'పై ప్రయోగం!

ABOUT THE AUTHOR

...view details