తెలంగాణ

telangana

By

Published : Oct 9, 2020, 4:06 PM IST

ETV Bharat / business

బంగారం, వెండి కాస్త ప్రియం- ప్రస్తుత ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు శుక్రవారం కాస్త ప్రియమయ్యాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.236 పెరిగింది. కిలో వెండి ధర రూ.62,700పైకి చేరింది.

gold price today in India
నేటి బంగారం ధరలు

బంగారం ధర శుక్రవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.236 పెరిగి.. రూ.51,558 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో పసిడికి ఇటీవల డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

వెండి ధర కిలోకు భారీగా రూ.376 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,775 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,910 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 24.27 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి:బ్యాంకింగ్ షేర్లు దూకుడు- ఏడో రోజూ లాభాల జోరు

ABOUT THE AUTHOR

...view details