బంగారం, వెండి ధరలు గురువారం మరింత తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర (Gold price in India) రూ.339 తగ్గి.. రూ.48,530 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గటం ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర (Silver rate in India) కూడా రూ.475 (కిలోకు) తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,772 వద్ద ఉంది.