తెలంగాణ

telangana

ETV Bharat / business

దంతేరాస్‌కు బంగారం అమ్మకాలు అంతంతే..! - dantheras

పండగలు, పెళ్లిళ్లు ఇలా శుభకార్యం ఏదైనా ఠక్కున గుర్తొచ్చేది బంగారమే. అక్షయ తృతీయ, దంతేరాస్‌ వచ్చాయంటే ఇక పుత్తడి విక్రయాలు జోరందుకుంటాయి. కొనుగోలుదారులతో దుకాణాలు కిక్కిరిసిపోతాయి. కానీ ఈ ఏడాది దంతేరాస్‌ (దీపావళి)కు మాత్రం మునుపటి మెరుపులు ఉండకపోవచ్చు.. దానికి కారణమేంటంటే?

దంతేరాస్‌కు బంగారం అమ్మకాలు అంతంతే..!

By

Published : Oct 9, 2019, 12:25 PM IST

అక్షయ తృతీయ, దంతేరాస్​ సమయాల్లో బంగారం విక్రయాలు జోరుగా సాగుతాయి. దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతుంటాయి. కానీ ఈ ఏడాది దంతేరాస్​ (దీపావళి)కు మునుపటి మెరుపులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు. బంగారం ధరలు పెరగడమే ఇందుకు కారణమని అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఈ సారి దంతేరాస్‌కు కనీసం 50 శాతం వరకు అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని బులియన్‌ వర్తకులు పేర్కొంటున్నారు.

దిగుమతి సుంకాల పెంపు..

బంగారం దిగుమతులపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో పెంచింది. గతంలో 10 శాతంగా ఉన్న సుంకాన్ని 12.5 శాతంగా చేసింది. ఈ పరిణామంతో బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. సాధారణ రోజుల్లో అమ్మకాలు భారీగా పడిపోయాయి. భారీగా ఉన్న బంగారం ధరలతో పెట్టుబడి పెట్టడానికీ ఎవరూ సుముఖత చూపడం లేదని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌ తగ్గిందని చెబుతున్నారు.

పండగ రోజుల్లోనూ..

పండగ రోజుల్లో అమ్మకాలు అంతంత మాత్రమే ఉన్నాయని వర్తకులు పేర్కొంటున్నారు. గతేడాది సెప్టెంబర్‌ 81.71 టన్నుల బంగారం దిగుమతి చేసుకోగా.. ఈ ఏడాది 26 టన్నులు మాత్రమే దిగుమతి చేసుకోవడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలూ దేశీయంగా బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఔన్స్‌ బంగారం ధర సుమారు 250 డాలర్ల మేర పెరిగింది. దీంతో బంగారం దిగుమతులు గతంతో పోలిస్తే భారీగా తగ్గుతున్నాయి.

ఇదీ చూడండి: నానోకు ఇక టాటా... 9 నెలల్లో ఒకే ఒక్క కారు విక్రయం!

ABOUT THE AUTHOR

...view details