బంగారం ధర శుక్రవారం భారీగా రూ.687 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రికార్డు స్థాయి వద్ద రూ.54,538కు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి ధరలు పుంజుకోవడం, స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాలను నమోదు చేస్తుండటం వల్ల పసిడి ధరలు ఈ స్థాయిలో పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.