తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి, వెండి ధరలు బుధవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.670కి పైగా ఎగిసింది. వెండి ధర కూడా భారీగా పెరిగి.. కిలో మళ్లీ రూ.62 వేల మార్క్ దాటింది.

Gold price rise today
పెరిగిన బంగారం ధరలు

By

Published : Dec 2, 2020, 4:05 PM IST

బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.675 ఎగిసి.. రూ.48,196 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో వరుసగా బంగారం ధరలు పెరుగుతుండటం వల్ల దేశీయంగానూ పసిడి ధరలు ఈ స్థాయిలో పుంజుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కూడా బుధవారం భారీగా కిలోకు(దిల్లీలో) రూ.1,280 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,496 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,815 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 23.80 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:'రూ.68 లక్షల కోట్లకు రాష్ట్రాల అప్పులు'

ABOUT THE AUTHOR

...view details