తెలంగాణ

telangana

ETV Bharat / business

పసిడి మరింత ప్రియం- నేటి ధరలు ఇవే.. - పది గ్రాముల బంగారం ధర

బంగారం, వెండి ధరలు కాస్త ప్రియమయ్యాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర మంగళవారం మళ్లీ రూ.51 వేలు దాటింది. వెండి కిలోకి భారీగా రూ.1,300లకు పైగా పెరిగింది.

TODAY GOLD RATE
నేటి బంగారం ధరలు

By

Published : Sep 29, 2020, 5:21 PM IST

బంగారం ధర మళ్లీ పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర మంగళవారం రూ.663 పెరిగి.. రూ.51,367 వద్దకు చేరింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్​లో పసిడి ధరలు పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయంగా బంగారం ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర మంగళవారం కిలోకు భారీగా రూ.1,321 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.61,919 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లోనూ ఔన్సు బంగారం ధర 1,882 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 23.56 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:ఫ్లాట్​గా ముగిసిన మార్కెట్లు- ఓఎన్​జీసీ 4% డౌన్​

ABOUT THE AUTHOR

...view details